
హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి ముహుర్తం ఖరారైంది. నవంబర్ 13న ఆమె వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం విధితమే.
2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వివాహంతో ఆమె రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించబోతోంది.