పాదాలతో...జీవితంలో ఒక రోజు | A day in the life of Lakshmi Manchu's feet | Sakshi
Sakshi News home page

పాదాలతో...జీవితంలో ఒక రోజు

Oct 8 2014 10:43 PM | Updated on Sep 2 2017 2:32 PM

పాదాలతో...జీవితంలో ఒక రోజు

పాదాలతో...జీవితంలో ఒక రోజు

నా పాతికేళ్ల కెరీర్‌లో నేను రూపొందించిన తొలి లఘు చిత్రం ఇది. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం చేశాను. ఈ కాన్సెప్ట్ నచ్చి, లక్ష్మీ చేశారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.

 ‘‘నా పాతికేళ్ల కెరీర్‌లో నేను రూపొందించిన తొలి లఘు చిత్రం ఇది. ఓ వినూత్న కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం చేశాను. ఈ కాన్సెప్ట్ నచ్చి, లక్ష్మీ చేశారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. ‘లక్ష్మీ మంచు పాదాలు... జీవితంలో ఒక రోజు’ అనే టైటిల్‌తో ఆయన ఈ లఘు చిత్రం తీశారు. ఈ లఘుచిత్ర విశేషాలు తెలియజేయడానికి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ -‘‘ఒక విషయాన్ని రెండున్నర గంటల్లో కాకుండా రెండు నిమిషాల్లో చెప్పగలిగితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు తెరరూపమే ఈ చిత్రం.
 
  ఓ వ్యక్తి దైనందిన జీవితంలో పాదాలు ఎలా ప్రయాణం చేశాయి? అనేది కథాంశం’’ అని తెలిపారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ -‘‘ఈ లఘు చిత్రానికి రామ్‌గోపాల్ వర్మ నా పాదాలను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ నాకు విపరీతంగా నచ్చేసింది. ఒక విషయాన్ని చెప్పడానికి రెండున్నర గంటలు అవసరం లేదని ఈ సినిమా చేసిన తర్వాతే తెలిసింది. పాతికేళ్లుగా సినిమాలు తీస్తున్న వర్మ దగ్గర కొత్త ఆలోచనలు చాలా ఉన్నాయని, ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయని అర్థమైంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement