మేమూ అంతరిక్షంలో విహరిస్తాం | We will fly on the space | Sakshi
Sakshi News home page

మేమూ అంతరిక్షంలో విహరిస్తాం

Feb 21 2016 4:36 PM | Updated on Sep 3 2017 6:03 PM

మేమూ అంతరిక్షంలో విహరిస్తాం

మేమూ అంతరిక్షంలో విహరిస్తాం

అంతరిక్షంలో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు దాదాపు 18,300 దరఖాస్తులు వచ్చాయి.

వాషింగ్టన్: అంతరిక్షంలో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు. వ్యోమగాములుగా తమను ఎంచుకోవాలంటూ అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు దాదాపు 18,300 దరఖాస్తులు వచ్చాయి. 2012 ఏడాదిలో వచ్చిన వాటితో పోల్చితే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ అని నాసా అధికారులు తెలిపారు.

వేర్వేరు నేపథ్యాలు ఉన్న వారు మార్స్‌లో ప్రయాణించాలని కోరుకుంటున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లీ బోల్డెన్ పేర్కొన్నారు. అయితే ఇంటర్వ్యూల తర్వాత చాలా నైపుణ్యం కలిగిన అదృష్టవంతులైన 8 నుంచి 14 మందిని మాత్రమే ఎంచుకుంటామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్‌లో త్వరలోనే ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వీరికి 2017లో శిక్షణ తరగతులు ఉంటాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement