విక‌లాంగుడికి శున‌కం అండ‌

Viral: Dog Push Wheelchair In Mexico - Sakshi

మ‌నిషికి బెస్ట్ ఫ్రెండ్ శున‌కం..

మెక్సికో: ఓ పోలీసు చేతులేని కోతికి అర‌టి పండు తినిపించ‌డం, బావిలో చిక్కుకున్న జీవాల‌ను బ‌య‌ట‌కు తీసి ర‌క్షించ‌డం, ఆక‌లిగా ఉన్న‌వాటికి ఆహారం పెట్ట‌డం.. ఇలా ఎన్నో ర‌కాలుగా మ‌నుషులు జంతువుల‌కు సాయం చేయ‌డం చూశాం. కానీ అందుకు భిన్నంగా ఇక్క‌డ ఓ మూగ జీవి దివ్యాంగుడికి సాయం చేస్తూ అండ‌గా నిలిచింది. మెక్సికోకు చెందిన విక‌లాంగ‌ బాలుడు న‌డ‌వ‌లేడు. దీంతో అత‌ను వీల్‌చైర్‌లో కూర్చుండ‌గా శున‌కం దాన్ని నెట్టుకుంటూ ముందుకు సాగింది. ముందు కాళ్ల‌తో వీల్‌చైర్‌ను నెట్టుతూ వెన‌క కాళ్ల‌తో మాత్ర‌మే న‌డిచింది. ఈ క్ర‌మంలో ఎక్క‌డా వీల్‌చైర్ కింద‌ ప‌డిపోకుండా, ఎక్క‌డా దారి త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌గా ముందుకు వెళ్లింది. (వైరల్‌.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!)

దీంతో దారివెంట వెళుతున్న జ‌నాలు ఈ అద్భుత‌ దృశ్యాల‌ను కెమెరాలో బంధించారు. ఈ వీడియోను భార‌త అట‌వీ అధికారి సుశాంత్ నంద సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఓ దివ్యాంగుడిని శున‌కం ఎంతో శున‌కం బాధ్య‌త‌గా చూసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 'మ‌నిషికి శున‌కాన్ని మించిన మిత్రువు లేదం'టూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది పాత వీడియోనే అయిన‌ప్ప‌టికీ నెట్టింట మ‌రోసారి చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే జంతువులు మ‌నుషుల‌కు సాయం చేయ‌డం కొత్తేమీ కాదు. క్వీన్స్‌లాండ్‌లో జెర్మ‌న్ షెఫ‌ర్డ్ జాతి శున‌కం‌ త‌న య‌జ‌మాని ప‌డ‌వ నీట మునిగిన‌ప్పుడు అత‌న్ని ప్రాణాల‌కు తెగించి కాపాడిన విష‌యం తెలిసిందే. (మూడు నెల‌లుగా ఆస్ప‌త్రి ఎదుట శున‌కం నిరీక్ష‌ణ‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top