పాక్‌ డిప్యూటీ చైర్మన్‌కు అమెరికా అవమానం | US refuses visa to Pakistan senate deputy chairman | Sakshi
Sakshi News home page

పాక్‌ డిప్యూటీ చైర్మన్‌కు అమెరికా అవమానం

Feb 12 2017 7:21 PM | Updated on Mar 23 2019 8:32 PM

పాక్‌ డిప్యూటీ చైర్మన్‌కు అమెరికా అవమానం - Sakshi

పాక్‌ డిప్యూటీ చైర్మన్‌కు అమెరికా అవమానం

అమెరికా నుంచి పాకిస్థాన్‌ సెనేట్‌ డిప్యూటీ చైర్మన్‌కు చుక్కెదురైంది. ఆయనకు వీసా ఇచ్చేందుకు అమెరికా ఎంబసీ నిరాకరించింది.

ఇస్లామాబాద్‌: అమెరికా నుంచి పాకిస్థాన్‌ సెనేట్‌ డిప్యూటీ చైర్మన్‌కు చుక్కెదురైంది. ఆయనకు వీసా ఇచ్చేందుకు అమెరికా ఎంబసీ నిరాకరించింది. అమెరికాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓ కార్యక్రమానికి పాక్‌ నుంచి సెనేట్‌ డిప్యూటీ చైర్మన్‌ మౌలానా అబ్దుల్‌ ఘఫూర్‌ హైదేరి వెళ్లాల్సి ఉంది. పాక్‌ ప్రతినిధిగా ఆయన ఆ సమావేశానికి హాజరు కావాలి.

ఈ కార్యక్రమం మరో వారంలో జరగనుంది. ఇంటర్నేషనల్‌ పార్లమెంటరీ యూనియన్‌(ఐపీయూ) పేరిట ఐక్యరాజ్యసమితి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తోంది. దీనికి హాజరయ్యేందుకే ఆయన వీసా దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. దీంతో ఆయన ఏకంగా ఈ కార్యక్రమానికి తాను బైకాట్‌ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఇక నుంచి అమెరికా నుంచి వచ్చే దౌత్య బృందాలకు పాక్‌ సెనేట్‌ నుంచి ఎలాంటి గౌరవ మర్యాదలు, అతిథ్యపూర్వక కార్యక్రమాలు ఉండబోవని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement