వైరల్‌ : టీవీ లైవ్‌ డిబెట్‌లో చితక్కొట్టుకున్నారు! | TV Debate in Pakistan Turns into Wrestling Match | Sakshi
Sakshi News home page

వైరల్‌ : టీవీ లైవ్‌ డిబెట్‌లో చితక్కొట్టుకున్నారు!

Jun 25 2019 9:42 AM | Updated on Jun 25 2019 5:42 PM

TV Debate in Pakistan Turns into Wrestling Match - Sakshi

ప్రత్యక్షప్రసారం అవుతుందన్న సోయి మరిచి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు ..

ఇస్లామాబాద్‌ : ఓ న్యూస్‌ చానెల్‌ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. ప్రత్యక్షప్రసారం అవుతుందన్న సోయి మరిచి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో లైవ్‌ డిబెట్‌ కాస్త రెజ్లింగ్‌ మ్యాచ్‌లా మారింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. సదరు చానెల్‌ నిర్వహించిన ‘న్యూస్‌లైన్‌ విత్‌ అఫ్తాబ్‌ ముఘేరి’ డిబెట్‌ షోకు అధికార పార్టీ  పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఇమ్తియాజ్‌ ఖాన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే చర్చా సందర్భంగా ఈ ఇద్దరి నేతల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది.

ప్రభుత్వంపై విమర్శనాత్మక దోరణితో ఇమ్తియాజ్‌ ఖాన్‌ వాదిస్తుండగా.. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతనిపై చేయి చేసుకొని నెట్టేశాడు. దీంతో ఇమ్తియాజ్‌ కూడా ప్రతిదాడి చేయడంతో డిబెట్‌ కాస్త రసాభసగా మారింది. ఇంతలో యాంకర్‌, ప్రోగ్రామ్‌ నిర్వాహకులు కలగజేసుకోవడం మసూర్‌ తిరిగొచ్చి తన సీటులో కూర్చోగా.. ఇమ్తియాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంత జరిగా సదరు చానెల్‌ తన షోను కొనసాగించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను పాక్‌కు ఓ మహిళా జర్నలిస్ట్‌ ‘దాడిచేయడమే నయాపాకిస్తాన్‌’ అని ప్రశ్నిస్తూ ట్విటర్‌లో షేర్‌చేయగా వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement