నుబియా.. చేతికి చుట్టేయవయా..

Smartphone and smartwatch from China Nubia Company - Sakshi

ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త రకం స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది.. ఫీచర్స్‌ మారుతున్నాయి.. ఫోన్‌ మాత్రం మారడం లేదు.. చైనాకు చెందిన నుబియా కంపెనీ ఫోన్‌నే మార్చేసింది.. స్మార్ట్‌ ఫోన్‌ను చేతికి చుట్టేసింది.. నుబియా ఆల్ఫా.. ఇది స్మార్ట్‌ఫోన్‌+స్మార్ట్‌ వాచ్‌.. చేతికి ధరించేలా రూపొందించిన అత్యంత ఆధునికమైన స్మార్ట్‌ ఫోన్‌ ఇదని కంపెనీ పేర్కొంటోంది. స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే సదు పాయాలన్నీ ఇందులో ఉంటాయి. వీడియోలు, మ్యూజిక్‌ ఇలా అన్నీ.. సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. ఆర్గానిక్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ వాడారు. అంతేకాదు.. ఇదో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ కూడా.. మీ ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది.

వాకింగ్‌ చేస్తున్నట్లయితే.. ఎంత దూరం చేశారు వంటి వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఈ మధ్యే దీన్ని బెర్లిన్‌లో ప్రదర్శనకు పెట్టారు. దీన్ని వేసుకున్నవాళ్లు బాగుందని.. ఎక్కువ బరువుగా లేదని చెప్పారు. అయితే, స్క్రీన్‌ రిజల్యూషన్‌ ఎంత... ఏ ప్రాసెసర్‌ వాడారు.. మెమొరీ ఎంత.. బ్యాటరీ సామర్థ్యం వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు దాన్ని మెరుగుపరుస్తున్నామని.. విక్రయాల సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా.. ధర రూ.50–60 వేల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top