ఉగ్రవాదుల ఖాతాల కోసం పోలీసుల వేట | Police team to hunt for IS social media accounts | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల ఖాతాల కోసం పోలీసుల వేట

Jun 22 2015 11:14 AM | Updated on Oct 22 2018 6:02 PM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, వాటిని బ్లాక్ చేసేందుకు యూరప్లో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.

లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, వాటిని బ్లాక్ చేసేందుకు యూరప్లో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐఎస్ సంస్థకు సంబంధించి సోషల్ మీడియాలో దాదాపు 50 వేల ఖాతాలున్నట్టు అంచనా వేశారు. ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించి రోజుకు లక్ష ట్వీట్లు చేస్తున్నారు.

యూరప్ పోలీస్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన యూరోపోల్ జూలై 1 నుంచి పనిచేయనుంది. సోషల్ మీడియాలో ఐఎస్కు సంబంధించిన ఖాతాలను తొలగించనుంది. ఇందుకోసం సోషల్ మీడియా కంపెనీల సహాకారం తీసుకోనుంది. ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి  కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement