మరో ఆల్బమ్తో మడోన్నా ప్రపంచ టూర్.. | Madonna to start 'Rebel Heart' tour in August | Sakshi
Sakshi News home page

మరో ఆల్బమ్తో మడోన్నా ప్రపంచ టూర్..

Mar 3 2015 8:28 AM | Updated on Sep 2 2017 10:14 PM

మరో ఆల్బమ్తో మడోన్నా ప్రపంచ టూర్..

మరో ఆల్బమ్తో మడోన్నా ప్రపంచ టూర్..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ గాయని మడోన్నా తాను రూపొందించిన ఆల్బమ్ను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ గాయని మడోన్నా తాను రూపొందించిన ఆల్బమ్ను ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి ప్రారంభంకానున్న ఈ ప్రమోట్ కార్యక్రమం డిసెంబర్ వరకు ప్రపంచంలోని పలు దేశాల్లో జరగనుంది. ఈ కార్యక్రమాలకుకు నిర్మాతగా ఎప్పటిలాగే లివ్ నేషన్ గ్లోబల్ టూరింగ్ డివిజన్ వ్యవహరించనుంది. అధికారికంగా ఈ కంపెనీ త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొట్టమొదటి ప్రమోట్ షో మియామిలోని అమెరికన్ ఎయిర్లైన్స్ ఎరేనాలో ఆగస్టు 29న ప్రారంభమై ఆతర్వాత వరుసగా అక్టోబర్ వరకు 25 నుంచి 30 షోలు కొనసాగనున్నాయి. అనంతరం యూరప్లో 20 నుంచి 25 షోలు ప్రదర్శన ఇవ్వనుంది. ఆ తర్వాత ఆసియా ఆస్ట్రేలియాలో కూడా మడోన్నా ప్రదర్శనలివ్వనున్నారు. ఆమె స్వయంగా రూపొందించిన ఈ ఆల్బమ్ పేరు 'రెబల్ హార్ట్'. ఇది మార్చి 10న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement