
జపాన్‌లో వర్షబీభత్సం: 36 మంది మృతి
కుండపోత వర్షాలతో జపాన్ పశ్చిమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో హిరోషిమా ప్రాంతంలో కనీసం 36మంది మరణించారు.
టోక్యో: కుండపోత వర్షాలతో జపాన్ పశ్చిమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో హిరోషిమా ప్రాంతంలో కనీసం 36మంది మరణించారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో హిరోషిమా శివార్లలో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని, వరదలా ప్రవహించిన బురద ఇళ్లను చుట్టుముట్టిందని అధికారులు తెలిపారు.