ధూమపానాన్ని 60 ఏళ్లలో మానేసినా ఆయుర్దాయం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
వాషింగ్ట: ధూమపానాన్ని 60 ఏళ్లలో మానేసినా ఆయుర్దాయం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) శాస్తవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. పొగతాగుతున్న 70 ఏళ్లు లేక ఆపై వయస్కులకు మరణ ముప్పు అసలు తాగని వారి కన్నా మూడు రెట్లు ఉంటుందని కూడా తేల్చారు.
ఈ అధ్యయనానికి 70 ఏళ్ల పైబడిన సుమారు లక్షన్నర మంది ప్రజల డేటాను విశ్లేషించారు. ధూమపానం అలవాట్ల గురించి తెలుసుకునే ప్రశ్నావళితో సమాచారం సేకరించారు. పొగ సంబంధ కారణాలతో సంభవించిన మరణాలను పరిగణలోకి తీసుకున్నారు. చనిపోయినపుడు– పొగ తాగడం ప్రారంభించినపుడు వయసులు, మానివేసినపుడు వయసు–70 ఏళ్ల తరువాత పీల్చిన పొగ పరిమాణం మధ్య సంబంధమున్నట్లు 2014–16 మధ్య జరిపిన విశ్లేషణల్లో వెల్లడైంది.