హజ్ యాత్ర ప్రారంభం | hajj toor begin | Sakshi
Sakshi News home page

హజ్ యాత్ర ప్రారంభం

Sep 11 2016 3:17 AM | Updated on Sep 4 2017 12:58 PM

సౌదీ అరేబియాలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్‌లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు.

మక్కా: సౌదీ అరేబియాలో  సుమారు 15 లక్షల మంది ముస్లింలు శనివారం పవిత్ర హజ్ యాత్రను ప్రారంభించారు. ఇరాన్‌లో అంతర్గత కలహాల వల్ల ఆ దేశ ప్రజలు  వేల సంఖ్యలో ఈసారి యాత్రకు దూరమయ్యారు. మక్కా నగరంలోని ప్రధాన మసీదులో ఈ వారం మత ప్రాథమిక సంప్రదాయాలు నిర్వహించిన తరువాత యాత్రికులు మీనాకు బయల్దేరారు.ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బస్సుల్లో, కొందరు కాలినడకన బయల్దేరారు. ఆదివారం పవిత్ర మౌంట్ అరాఫత్‌కు చేరుకుంటారు. సైతానుపై రాళ్లు రువ్వే కార్యక్రమం మీనాలో సోమవారం మొదలవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement