జస్టిన్‌ బీబర్‌కు షాక్‌ | Sakshi
Sakshi News home page

జస్టిన్‌ బీబర్‌కు షాక్‌

Published Sat, Dec 24 2016 3:08 PM

జస్టిన్‌ బీబర్‌కు షాక్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: గ్రామీ అవార్డ్‌ విన్నింగ్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌కు అర్జెంటీనాలోని ఓ కోర్టు షాక్‌ ఇచ్చింది. 2013లో బీబర్‌ అంగరక్షకులు ఓ ఫోటో గ్రాఫర్‌పై దాడి చేసిన కేసులో.. బీబర్‌ విచారణను ఎదుర్కోవాలని న్యాయమూర్తి ఆల్బర్టో బానోస్‌ పేర్కొన్నారు.

బీబర్‌ అంగరక్షకులు ఫోటో గ్రాఫర్‌పై దాడి చేసి.. అతడి వద్ద నుంచి డబ్బు, ఇతర వస్తువులను దొంగిలించారని, ఈ దాడిలో బీబర్‌ ప్రమేయం సైతం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ తీరుపై బీబర్‌ అసంతృప్తిగా ఉన్నాడని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఏదేమైనా ఈ కేసు చిక్కులు తొలగేంతవరకు బీబర్‌ అర్జెంటీనాలో అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. బీబర్‌ తరఫు లాయర్లు దీనిపై కోర్టులో అప్పీల్‌ చేయనున్నారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement