కాబుల్ పేలుళ్ల మృతుల్లో ఇద్దరు భారతీయులు | 2 indians in kabul blast deaths | Sakshi
Sakshi News home page

కాబుల్ పేలుళ్ల మృతుల్లో ఇద్దరు భారతీయులు

Jun 20 2016 10:24 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఆప్ఘనిస్తాన్ లోని కాబుల్ లో జరిగిన మానవబాంబు పేలుడు లో మృతి చెందిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ(ఎంఈఏ) ప్రకటించింది.

కాబుల్: ఆప్ఘనిస్తాన్ లోని కాబుల్ లో జరిగిన మానవబాంబు పేలుడు లో మృతి చెందిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ(ఎంఈఏ) ప్రకటించింది. మృతులు ఇద్దరూ డెహ్రడూన్ కు చెందిన గణేశ్ తాప, గోవింద్ సింగ్ లుగా గుర్తించినట్లు ఎంఈఏ తెలిపింది. ప్రభుత్వం బాధితుల కుటుంబాలతో టచ్ లో ఉన్నట్లు వివరించింది. మృతదేహాలను వీలైనంత త్వరగా రప్పించి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, సోమవారం ఉదయం ఓ వ్యక్తి ప్రైవేటు కంపెనీలకు సెక్యూరిటీ గార్డులను తీసుకువెళ్తున్న మినీ బస్సుపై మానవబాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, 8 మందికి గాయలైనట్లు ఆప్ఘాన్ ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement