‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స | YSRCP: Private member Bill not necessary for AP Special Status | Sakshi
Sakshi News home page

‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స

Jul 22 2016 2:39 AM | Updated on Jul 12 2019 3:10 PM

‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స - Sakshi

‘హోదా’ బిల్లుకు మద్దతిస్తాం: బొత్స

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రాజ్యసభకు రానున్న ప్రైవేటు బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం రాజ్యసభకు రానున్న ప్రైవేటు బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని తమ పార్టీ పూర్తిగా విశ్వసిస్తోందని, దీనికోసం ఎవరు ఏ రీతిలో పోరాడినా తమ మద్దతు ఉంటుందని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం  విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పిందన్నారు. అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వం రెండుసార్లు తీర్మానం పెట్టినపుడు కూడా తాము సమర్థించామన్నారు.

హోదా కోసం పార్లమెంటులోగాని, అసెంబ్లీలోగాని బిల్లు పెట్టాల్సిన అవసరమే లేదని, దానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే చాలునన్నారు. 2014, మార్చి 2న అప్పటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలోప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేశారన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ఆమోదం పొందకపోతే దీన్ని సాకుగా చూపి హోదా అంశాన్ని అటకెక్కించేస్తారనే భయం కూడా తమకుందని బొత్స చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement