వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నిర్వహించారు.
సిటీబ్యూరో: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులను పట్టు వస్త్రాలతో సత్కరించా రు. సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం పెద్దగుడి సమీపంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నల్లా సూర్యప్రకాశ్, వీఎల్‌ఎన్ రెడ్డి, జి. మహేందర్ రెడ్డి, నాయకులు మాదిరెడ్డి భగవంత్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు ఆదం విజయ్ కుమార్, జి. సురేష్ రెడ్డి, గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకట రమణ, దుర్భాక గోపాల్ రెడ్డి, మీసాల్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, టి. కుమార్ యాదవ్, బ్రహ్మనందరెడ్డి, సురేష్‌గౌడ్, బ్రహ్మయ్య, మహిళ నాయకులు అరుణ, జులీ, వరలక్ష్మి, అరుణా రెడ్డి, విష్ణుప్రియ, శ్రీకాంత్‌లాల్, భీష్వ రవీందర్, జయ, కొండా రోహిత్ రెడ్డి, సాయిరామ్ పాల్గొన్నారు.