బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్ | ys jagan mohan reddy accuses tdp of 'false propaganda' ap budget 2016 | Sakshi
Sakshi News home page

బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్

Mar 10 2016 4:05 PM | Updated on Jul 12 2019 6:01 PM

బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్ - Sakshi

బడ్జెట్ అంతా అభూత కల్పన: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్పై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విరిచారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్పై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విరిచారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బడ్జెట్ అంతా అభూత కల్పనే అని, వ్యవసాయ కేటాయింపులు దారుణమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

 

రుణమాఫీకి కేటాయించిన నిధులు వడ్డీలో మూడో వంతుకు సరిపోవని ఆయన అన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒకేలా ఉన్నాయన్నారు. బీసీలు, కాపులకు కేటాయింపులు సరిగా లేవని, గతంలో చెప్పినదానికి, ఇప్పుడు కేటాయించిన దానికి పొంతన లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement