పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan appreciated PV sindhu | Sakshi
Sakshi News home page

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

Nov 29 2015 5:48 PM | Updated on Jul 25 2018 4:09 PM

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్లో విజయం సాధించిన పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.

మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజయం సాధించిన తెలుగుతేజం పీవీ సింధును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఆదివారం జరిగిన మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-9, 21-23, 21-14 తేడాతో జపాన్కు చెందిన క్రీడాకారిణి మినత్సు మితానిని ఓడించింది. మకావు ఓపెన్లో సింధు విజేతగా నిలవడమిది వరుసగా మూడోసారి కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement