స్కైవేలు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ను అధిగమిస్తాం: కేటీఆర్ | will over come hyderabad traffic issue with fly overs, says minister ktr | Sakshi
Sakshi News home page

స్కైవేలు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ను అధిగమిస్తాం: కేటీఆర్

Jan 17 2017 12:56 PM | Updated on Aug 30 2019 8:24 PM

స్కైవేలు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ను అధిగమిస్తాం: కేటీఆర్ - Sakshi

స్కైవేలు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్‌ను అధిగమిస్తాం: కేటీఆర్

నగరంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను స్కైవేలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో అధిగమిస్తామని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.

నగరంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను స్కైవేలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో అధిగమిస్తామని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ఆయన తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం మెట్రోరైలు పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ ఏడాదే తొలి దశ పనులు పూర్తవుతాయని అన్నారు. 
 
నాలాలా పునరుద్ధరణ కోసం ఆక్రమణలు తొలగించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలతో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని వివరించారు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు. జీహెచ్ఎసంఈలో సిబ్బందిని కూడా పెంచామన్నారు. హుస్సేన్ సాగర్ నీటి నాణ్యతలో గణనీయమైన మార్పు కనిపించిందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement