ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోం | V Hanumantha Rao takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోం

May 29 2014 2:12 PM | Updated on Sep 19 2019 8:28 PM

ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోం - Sakshi

ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోం

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును హెచ్చరించారు.

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరు మారిస్తే ఊరుకోమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును  హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ మనోభావాలను దెబ్బ తీయవద్దు అంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడికి సూచించారు.

 

హైదరాబాద్లో నిన్న మొన్న టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు సభలు జరిగాయి. ఆ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.... శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు నందమూరి తారక రామారావు ఎయిర్ పోర్ట్గా నామకరణం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దాంతో చంద్రబాబు వ్యాఖ్యలపై వీహెచ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే చంద్రబాబు ప్రకటనపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement