పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం | Sakshi
Sakshi News home page

పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం

Published Tue, Dec 27 2016 3:04 AM

పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం

ఫాసిస్ట్‌ శక్తులను ఎదిరించేందుకు వామపక్షాలు ఐక్యం కావాలి: సురవరం సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఓట్లు, సీట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎప్పు డూ తహతహలాడలేదని, పోరాటాల ద్వారా నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లోని దేశో ద్ధారక భవన్‌లో సీపీఐ హైదరా బాద్‌ నగర కార్యదర్శి ఇ.టి. నరసింహ అధ్యక్షతన ఆ పార్టీ 91వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సురవరం మాట్లా డుతూ.. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ అనేక ఆటుపోట్లను అధిగమించి 91వ వసంతంలోకి అడుగిడిందన్నారు.

ఏనాడూ స్వాతంత్య్ర పోరాటం, తెలం గాణ సాయుధ పోరాటాలలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంఘ్‌ పరివార్, బీజేపీలు సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ సైనిక చర్య వల్లే తెలంగాణ విముక్తి పొందిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం కొంతమంది కమ్యూ నిజం అంపశయ్యపై ఉందని మాట్లాడుతున్నారని, ప్రజల పక్షాన ఉద్యమాన్ని బలోపే తం చేస్తూ నిరంతరం తమ పార్టీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటుందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని స్పష్టం చేశారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ శక్తులను ఎదిరించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 91వ వార్షికోత్సవ స్ఫూర్తితో పార్టీ ప్రజా పోరాటాల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలపై ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు హిమాయత్‌నగర్‌లోని ఎన్‌. సత్యనారాయణరెడ్డి భవన్‌ నుంచి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ సమితి సభ్యురాలు డాక్టర్‌ బి.వి. విజయలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు అమృతమ్మ, రాధిక, విద్యార్థి సంఘం నాయకులు స్టాలిన్, ఆర్‌.ఎన్‌. శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement