ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ | T pcc chief uttam kumar reddy leaves for Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

Jun 14 2016 8:01 AM | Updated on Sep 19 2019 8:44 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం హస్తినకు పయనం అయ్యారు. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు.

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం హస్తినకు పయనం అయ్యారు. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్తో భేటీ అవుతారు. ఫిరాయింపులు, వలసలు, పార్టీలో నెలకొన్న పరిస్థితిపై ఆయన నివేదిక ఇవ్వనున్నారు.

కాగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ నేతలు వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు హైదరాబాద్లో దిగ్విజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement