వ్యభిచార గృహాలపై ఎస్‌ఓటీ దాడి | SOT rides on brothel houses | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై ఎస్‌ఓటీ దాడి

Jan 6 2015 6:36 PM | Updated on Sep 2 2017 7:19 PM

నగర శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు సోమవారం దాడులు చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు దాడులు చేశారు.  హయత్‌నగర్, సరూర్‌నగర్, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలలో ఈ దాడులు చేశారు. మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.

వీరిలో ఎనిమిది మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కాకినాడ, విజయవాడ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. హయత్‌నగర్‌లో ఇద్దరు మహిళలు, విటుడు, సరూర్‌నగర్‌లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, మల్కాజిగిరిలో నలుగురు మహిళలు పట్టుబడ్డారు. నిందితులు వ్యభిచారం కోసం వినియోగిస్తున్న మూడు ఇళ్లనూ సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, ఎస్‌ఐలు ఆంజనేయులు, రాములు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement