హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పాముకాటుకు గురైంది.
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేసిన సంఘటన నగరంలోని చిలుకానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వెలుగుచూసింది. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి(8)ని పాము కాటు వేసింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు విద్యార్థిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.