కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతి | SI Ramulu deid in Kallu Compound | Sakshi
Sakshi News home page

కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతి

Jan 21 2015 3:36 AM | Updated on Sep 2 2018 3:46 PM

కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతి - Sakshi

కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతి

కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: కల్లు కాంపౌండ్‌లో ఎస్‌ఐ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రాములు(53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.రాజేంద్రనగర్ బుద్వేల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రాములు మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లి..

10 గంటలకు అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓ వ్యక్తి చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతిచెందిన వ్యక్తి ఎస్‌ఐ రాములుగా గుర్తించారు. అధికారులకు సమాచారం అందించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాములుకు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే కల్లు కాంపౌండ్ బయట రాములు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తుండగా.. స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్‌లోనే చనిపోయాడని అంటున్నారు. కల్లు తాగుతూ నేలకొరిగాడని.. అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement