భారీవర్షాలకు ఇళ్లు కూలి ఏడుగురు దుర్మరణం | Seven killed in house collapse due to heavy rains | Sakshi
Sakshi News home page

భారీవర్షాలకు ఇళ్లు కూలి ఏడుగురు దుర్మరణం

Aug 31 2016 12:18 PM | Updated on Apr 3 2019 7:53 PM

భారీవర్షాలకు ఇళ్లు కూలి ఏడుగురు దుర్మరణం - Sakshi

భారీవర్షాలకు ఇళ్లు కూలి ఏడుగురు దుర్మరణం

హైదరాబాద్‌ లో వర్షాల కారణంగా ఇళ్లు కూలి ఏడుగురు మృతి చెందారు.

భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో  విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. రామాంతపూర్‌లో నలుగురు మృతి చెందారు. భారీగా కురిసిన వానకు ఇంటి పై కప్పు కూలి ఈ ప్రమదాం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు . ఇదే ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శేఖర్‌, పార్వతి, బాలస్వామి, చిన్నమ్మలుగా గుర్తించారు.

మరో వైపు భోలక్‌పూర్‌లో ఇంటి పైకప్పు కుప్పకూలడంతో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు.   ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  శిథిలావస్థకు చేరుకున్న భవనాలను, ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు మేయర్‌ తెలిపారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement