ప్రముఖ సంగీత విద్వాంసుడు, గేయ రచయిత, కవి డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్రకు సాలూరి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు రసమయి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.కె రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సాయికృష్ణ యాచేంద్రకు సాలూరి ప్రతిభా పురస్కారం
Oct 25 2016 7:03 PM | Updated on Sep 4 2017 6:17 PM
	హైదరాబాద్: ప్రముఖ సంగీత విద్వాంసుడు, గేయ రచయిత, కవి డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్రకు సాలూరి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు రసమయి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం.కె రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత సంగీత సామ్రాట్ దివంగత డాక్టర్ సాలూరి రాజేశ్వర రావు 95వ జయంతి సందర్భంగా యాచేంద్రకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. 
	 
					
					
					
					
						
					          			
						
				
	ఈ నెల 28వ తేదీ సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
