రాజకీయ అవినీతి రెట్టింపు: టీపీసీసీ | Political corruption double : Tpcc | Sakshi
Sakshi News home page

రాజకీయ అవినీతి రెట్టింపు: టీపీసీసీ

Jun 1 2016 3:40 AM | Updated on Sep 29 2018 4:44 PM

రాజకీయ అవినీతి రెట్టింపు: టీపీసీసీ - Sakshi

రాజకీయ అవినీతి రెట్టింపు: టీపీసీసీ

రాష్ట్రంలో రాజకీయ అవినీతి రెట్టింపయిందని, సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఈ అంశంపై గన్‌పార్కు దగ్గర బహిరంగ చర్చకు రావాలని

దమ్ముంటే చర్చకు రావాలంటూ సీఎంకు సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ అవినీతి  రెట్టింపయిందని, సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఈ అంశంపై గన్‌పార్కు దగ్గర బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. రాజకీయ అవినీతి లేకుండా చేశానని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు ఏయే సంస్థలకు దక్కాయో, దాని వెనుక ముడుపుల బాగోతం గురించి ప్రజలకు చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి రాష్ట్రం లోనే ఉందని, సీఎం క్యాంపు కార్యాలయమే దానికి వేదికగా మారిందన్నారు.

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వంటి వారి సమక్షంలో చర్చకు సిద్ధం కావాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు అవి నీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు.  ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీల నుంచి గెలిచినవారు టీఆర్‌ఎస్‌లో ఎలా చేరుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకుల ఇంటి ముందు ధర్నాలు చేస్తామన్నారు. బీజేపీకి తెలంగాణలో ఎదిగే అవకాశమే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement