ఐసెట్‌ దరఖాస్తుకు నేడు చివరితేదీ | Iset entrance exam on may 18 | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ దరఖాస్తుకు నేడు చివరితేదీ

Apr 15 2017 11:23 PM | Updated on Sep 5 2017 8:51 AM

2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌ ఐసెట్‌–2017 పరీక్షకు దరఖాస్తు గడువు నేటి (ఆదివారం)తో ముగియనుంది.

మే 18న ప్రవేశ పరీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్‌ ఐసెట్‌–2017 పరీక్షకు దరఖాస్తు గడువు నేటి (ఆదివారం)తో ముగియనుంది. ఇప్పటివరకు 59,825 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్‌ ఓం ప్రకాశ్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఏప్రిల్‌ 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు, రూ.2,000తో మే 2 వరకు, రూ.5,000తో మే 8 వరకు, రూ.10,000తో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 18న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

పోల్

Advertisement