వయోపరిమితి పెంచండి | Increase age restriction in police notification | Sakshi
Sakshi News home page

వయోపరిమితి పెంచండి

Apr 15 2018 12:42 AM | Updated on Aug 15 2018 9:06 PM

Increase age restriction in police notification  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ లో త్వరలో భర్తీ కానున్న సబ్‌ఇన్‌ స్పెక్టర్, కానిస్టేబుల్‌ పోస్టులకు ఈసారీ వయోసడలింపు కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. రాష్ట్ర సాధనలో ప్రధాన నినాదంగా వినిపించిన ఉద్యోగాల సమస్యకు పరిష్కార మార్గంగా వయోసడలింపు కల్పించాలన్న అభ్యర్థనలు అటు పోలీస్‌శాఖకు, ఇటు ప్రభుత్వానికి వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర ఆవి ర్భావం తర్వాత విడుదలైన 10వేల పోలీస్‌ పోస్టుల భరీలో సీఎం కేసీఆర్‌ వయోపరిమితి పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు మూడే ళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు కల్పించారు. ఈసారి విడుదల కాబోతు న్న భారీ నోటిఫికేషన్‌కూ వయోసడలింపు కల్పి ంచేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌ను కలసిన అభ్యర్థులు..
పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ ద్వారా 18 వేల పోస్టులు భర్తీ అవుతున్నందున వయోసడలింపు కల్పిస్తే అనేక మందికి లబ్ధి చేకూర్చిన వారవుతారని నిరుద్యోగులు అటు డీజీపీ, ఇటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సారి చివరి అవకాశంగా ఆరేళ్ల వరకు వయోపరిమితి పెంపును కల్పిస్తే 50 వేల మందికి పైగా అభ్యర్థులు పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తుకు అవకాశం పొందిన వారవుతారని పలువురు అభ్యర్థులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

దీనిపై చర్యలు తీసుకోవాలని, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో చర్చించాలని శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలసి కోరారు. గత రిక్రూట్‌మెంట్‌లో ఇంగ్లిష్‌ వెయిటేజ్‌ ఇవ్వడం వల్ల రూరల్‌ ప్రాంతాల్లో చదువుకున్న అభ్యర్థులు నష్టపోయారని, దీనిపైకూడా చర్చించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement