టీడీపీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తే వ్యభిచారం కాదా?: జీవన్‌రెడ్డి | If the minister is not prostitution ?: TDP MLAs jivan reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తే వ్యభిచారం కాదా?: జీవన్‌రెడ్డి

Jun 17 2016 3:14 AM | Updated on Aug 14 2018 10:59 AM

టీడీపీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తే   వ్యభిచారం కాదా?: జీవన్‌రెడ్డి - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తే వ్యభిచారం కాదా?: జీవన్‌రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజకీయ వ్యభిచారం కాదా అని....

సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజకీయ వ్యభిచారం కాదా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారినని కేసీఆర్ ఒప్పుకున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. గతంలో 10 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నియంతృత్వ పోకడల ను వ్యతిరేకించారు తప్ప వారు కాంగ్రెస్‌పార్టీలో చేరలేదన్నారు. దానం నాగేందర్ విషయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే కాంగ్రెస్‌లోకి తీసుకుని ఆదర్శంగా నిలిచామన్నారు.

కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌లో గడిపినదానిలో సగం రోజులు కూడా సచివాలయానికి రాలేదన్నా రు.  రాజకీయ వ్యభిచారానికి లెసైన్సు: మల్లు రవి రాజకీయ వ్యభిచారాన్ని కేసీఆర్ లెసైన్సు ఇచ్చి నడుపుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ సుస్థిర ప్రభుత్వం అంటే రాష్ట్రంలోని 119 ఎమ్మెల్యేల్లో 63 మంది సరిపోరా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ఇతరపార్టీల ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement