నిద్ర లేని రాత్రి.. రోడ్లన్నీ ఖాళీ | Hyderabad roads deserted on new year day | Sakshi
Sakshi News home page

నిద్ర లేని రాత్రి.. రోడ్లన్నీ ఖాళీ

Jan 1 2014 9:48 AM | Updated on Oct 17 2018 4:29 PM

హైదరాబాద్ నగరం రాత్రంతా నిద్రపోలేదు. న్యూ ఇయర్ జోష్ దద్దరిల్లింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

హైదరాబాద్ నగరం రాత్రంతా నిద్రపోలేదు. న్యూ ఇయర్ జోష్ దద్దరిల్లింది. ఎక్కడ చూసినా పార్టీలు, కేకులు, డ్రింకులు, కేరింతలు... అన్నీ. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేశారు. చిన్న, పెద్ద, ఆడ, మగ.. ప్రతి ఒక్కరూ రాత్రంతా మేలుకుని ఉండి ఈసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇళ్లలో కూడా కేకులు కట్ చేసుకుని, భారీ సౌండుతో మ్యూజిక్ పెట్టుకుని, ఎవరికి చేతనైనట్లుగా వాళ్లు డాన్సులు చేసుకుంటూ ఆస్వాదించారు.

రాత్రంతా నిద్ర లేకపోవడం, పగలు చాలావరకు విద్యాసంస్థలు, కార్యాలయాలన్నింటికీ సెలవులు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. సాధారణంగా ఉదయం 7.30-8.00 గంటల నుంచే విపరీతమైన వాహనాల రద్దీతో కిటకిటలాడిపోయే రోడ్లు కాస్తా పూర్తిగా బోసిపోయాయి. హైదరాబాద్ రోడ్ల మీద ఎవరైనా కావాలంటే వడియాలు ఎండబెట్టుకోవచ్చని కూడా ఎఫ్ఎం చానళ్లలో రేడియో జాకీలు సరదాగా చెబుతూ వచ్చారు.  

సాధారణంగా వనస్థలిపురం ప్రాంతం నుంచి నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలకు రావాలంటే మామూలు రోజుల్లో టూ వీలర్ మీద అయితే గంటన్నర, సిటీ బస్సులో అయితే రెండు గంటలకు తక్కువ పట్టదు. కానీ, వారాంతపు రోజు కాకపోయినా, బుధవారం అయినా కూడా కేవలం 45 నిమిషాల్లోనే టూ వీలర్ మీద రాగలిగే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కొత్త సంవత్సరం హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద ప్రయాణించేవాళ్లకు కూడా చాలా సంతోషంగా ప్రారంభమైందన్నమాట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement