భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 8వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు.
రంగారెడ్డి: భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 8వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వరప్రసాద్ కథనం ప్రకారం... కేపీహెచ్‌బీ కాలనీ నివాసి శ్రీనివాస్, మీనాక్షి భార్యాభర్తలు. వీరి వివాహం మే 2013లో ఘనంగా జరిగింది. వివాహానంతరం వీరి కాపురం కొన్ని రోజులు సజావుగా సాగింది. కొంత కాలంగా శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడు. స్థానికుడు సలీంతో మీనాక్షి చనువుగా ఉండటంతో ఆమె ప్రవర్తనపై శ్రీనివాస్ అనుమానం పెంచుకున్నాడు.
2014 జనవరి 8న మద్యం మత్తులో భార్యతో గొడవపడి కర్రతో తలపై బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావమై మీనాక్షి చనిపోయింది. అడ్డొచ్చిన శ్రీనివాస్ అత్తకు కూడా గాయాలయ్యాయి. మృతురాలి సోదరుడు సుధీర్‌బాబు ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎస్‌వీవీ నాథ్‌రెడ్డి పై విధంగా తీర్పు చెప్పారు.