నేరేడ్‌మెట్ ప్రగతి నగర్‌లో మంగళవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్: నేరేడ్‌మెట్ ప్రగతి నగర్‌లో మంగళవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను ఓ వ్యక్తి నడి రోడ్డుపై కొట్టి చంపాడు. స్థానికంగా నివాసం ఉంటున్న గణేష్, వరలక్ష్మి(30) దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న గణేష్ అర్థరాత్రి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తలపై గట్టిగా రోకలిబండతో కొట్టటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.