100 కోట్లతో ఉద్యాన ప్రయోగశాలలు | horticulture laboratories @ Rs.100 crores | Sakshi
Sakshi News home page

100 కోట్లతో ఉద్యాన ప్రయోగశాలలు

Sep 13 2016 2:34 AM | Updated on Sep 4 2017 1:13 PM

ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పీజీ కళాశాల నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రూ.100 కోట్లతో పరిపాలన భవనం, ప్రయోగశాలలు, పీజీ కళాశాల నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో సోమవారం నూతన కళాశాల, హాస్టల్ భవనాల ప్రారంభానికి హాజరై మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ సాధించిన పరిశోధన విజయాలపై సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement