38 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన వాన | Sakshi
Sakshi News home page

38 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన వాన

Published Fri, May 6 2016 6:14 PM

Heavy rain lashes Hyderabad, highest in 4 decades

హైదరాబాద్ : శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ నగరంలో కురిసిన వానతో దాదాపు నాలుగు దశాబ్దాల నాటి రికార్డు బద్దలయింది. మహానగరంలో 1978 మే 24వ తేదీన 7.9 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 2016 మే 6న ఏకంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం గమనార్హం.

ఉపరితల ద్రోణి ప్రభావం, క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఎక్కువగా ఉండడం, గాలిలో తేమ అధికంగా ఉండడంతో భారీ వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాగా కేవలం మూడు గంటల వ్యవధిలో ఏకంగా 8 సెంటీమీటర్ల కుండపోత కురవడం మే నెలలో ఇప్పటివరకు రికార్డేనన్నారు. శని,ఆదివారాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement