నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
హైదరాబాద్ : నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కోఠి, మలక్పేట్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచే కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.