జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
త్వరలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగాల భర్తీ
Jul 20 2017 4:27 PM | Updated on Sep 5 2017 4:29 PM
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బల్దియాలో ఖాళీగా ఉన్న 226 పోస్టులను భర్తీ చేయడానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో 200 టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు, 26 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను పూరించడానికి వెంటనే తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి.. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు.
Advertisement
Advertisement