వైఎస్సార్సీపీ కార్యాలయంలో వినాయకచవితి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
వైఎస్సార్సీపీ కార్యాలయంలో చవితి, టీచర్స్ డే వేడుకలు
Sep 5 2016 12:30 PM | Updated on May 29 2018 2:59 PM
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో వినాయకచవితి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురి పార్టీ ముఖ్య నేతలు పాల్గొని గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని నేతలు ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను వైఎస్సార్సీపీ నేతలు సన్మానించారు. ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Advertisement