జయశంకర్ వ్యవసాయ వర్సిటీని గురువారం వివిధ దేశాల ప్రతినిధులు సందర్శిం చారు. భారత్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ వర్సిటీని గురువారం వివిధ దేశాల ప్రతినిధులు సందర్శిం చారు. భారత్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ విస్తరణ, యాజమాన్య సంస్థలో నిర్వహిస్తున్న ‘ఫీడ్ ది ఫ్యూచర్- ఇండియా ట్రయాంగులర్ ట్రైనింగ్’లో పాల్గొనేందుకు వచ్చిన అఫ్గానిస్తాన్, కంబోడియా, ఘనా, కెన్యా, లైబీరియా, మాలవి, మంగోలియా, మొజాంబిక్ దేశాలకు చెందిన 29 మంది వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన విస్తరణాధికారులు వర్సిటీకి వచ్చి పరిశోధనల తీరును పరిశీలించారు. వారికి వర్సిటీ గురించి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల గురించి వీసీ ప్రవీణ్‌రావు వివరించారు. మిల్లట్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించారు.