ప్రభుత్వం వెంటనే రూ. 2,078 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ మెనేజ్‌మెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
నేడు వైస్ చాన్స్‌లర్లకు విజ్ఞాపన పత్రాలు: యాజమాన్యాల సంఘం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వెంటనే రూ. 2,078 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ మెనేజ్‌మెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే ఈనెల 11 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో జరిగే డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తామని పేర్కొంది. యాజ మాన్యాల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశం పలు తీర్మానాలు ఆమోదించింది.
ఫీజు బకాయిలు రూ. 2,078 కోట్లు జూన్ 30కి పూర్తిగా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. దీంతో సప్లిమెంటరీ పరీక్షలకు సహకరించకూడదని నిర్ణయించి నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి వెల్లడించారు. ఆందోళనలో భాగంగా ఈ నెల 10న అన్ని వర్సిటీల వీసీలకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.