ప్రైవేట్ యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కో సెక్షన్‌లో 50 మందికి మించి విద్యార్థులను తీసుకున్నారన్న ఫిర్యాదులపై విద్యాశాఖ స్పందించింది.
విద్యాశాఖ ఆదేశాలు.. సడలించాలంటున్న యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కో సెక్షన్‌లో 50 మందికి మించి విద్యార్థులను తీసుకున్నారన్న ఫిర్యాదులపై విద్యాశాఖ స్పందించింది. వెంటనే ఫిర్యాదులు వచ్చిన పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. జీవో నంబర్ 1 ప్రకారం అన్ని పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది.
విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో సెక్షన్‌లో 30 మంది విద్యార్థులకు మించి ఉండటానికి వీల్లేదు. ప్రాథ మికోన్నత పాఠశాలలైతే 35 మంది, ఉన్నత పాఠశాలల్లో అరుుతే ప్రతి సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మించి ఉండడానికి వీలులేదు. అరుుతే ఈ నిబంధనల అమలు విద్యాశాఖకు సమస్యగా మారింది. ప్రైవేటు యాజమాన్యాలు దీనిపై ఆం దోళన బాట పట్టారుు. ఆ నిబంధన నుంచి మినహారుుంచాలని విజ్ఞప్తులు చేశా రుు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాశాఖ లేఖ రాసింది.