వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ భేటీ | digvijaya singh meeting with warangal congress leaders at gandhi bhavan | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ భేటీ

Oct 29 2015 1:19 PM | Updated on Sep 3 2017 11:41 AM

వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా గురువారం గాంధీభవన్లో ఆ జిల్లా నేతలతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ సేకరిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల బరిలో వెంకటస్వామి తనయుడు, మాజీ ఎంపీ వివేక్ను నిలపాలని జిల్లా నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.

పోటీ చేసేందుకు వివేక్ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని దిగ్విజయ్ సింగ్ ... వరంగల్ జిల్లా నేతలను కోరారు. ఆ క్రమంలో సర్వే సత్యనారాయణ, ఎస్. రాజయ్య, ఆర్ ప్రతాప్ పేర్లు మాత్రం వారు వెల్లడించారు. కాగా వీరిలో ఎవరినీ ఎంపిక చేయాలనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement