ఆ దెబ్బతో మూలకుపడ్డ నిఘా నేత్రాలు | CC cameras not working due to heavy rain in Hyderabad city | Sakshi
Sakshi News home page

ఆ దెబ్బతో మూలకుపడ్డ నిఘా నేత్రాలు

Jun 7 2016 6:01 PM | Updated on Aug 14 2018 3:37 PM

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలపై వర్షం దెబ్బ పడింది.

అంబర్‌పేట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలపై వర్షం దెబ్బ పడింది. గాలి వాన బీభత్సంతో నిఘా కెమెరాలు పని చేయడం మానేశాయి. నగరంలోనే సీసీ టీవీ కెమెరాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో సగానికి పైగా మూడో నేత్రాలు మూలకుపడ్డాయి. ఈ పోలీస్టేషన్ పరిధిలో 110 కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండగా ప్రస్తుతం 60 వరకు పని చేయడం లేదు.

గాలి వాన తీవ్రతకు చెట్ల కొమ్మలు విరిగిపడడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో ఇవి పని చేయకుండా పోయాయి. ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌కుమార్ ఏమంటున్నారంటే..‘గాలి వానకు దెబ్బతిన్న సీసీ టీవీ కెమెరాలకు మరమ్మతులు చేయిస్తున్నాం..త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement