మండల స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారుల హోదా పేర్లను ప్రభుత్వం మార్చింది. గతంలో ఉన్న ఉర్దూ పేర్లను మళ్లీ వాడుకలోకి తెచ్చింది.
సాక్షి, హైదరాబాద్: మండల స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారుల హోదా పేర్లను ప్రభుత్వం మార్చింది. గతంలో ఉన్న ఉర్దూ పేర్లను మళ్లీ వాడుకలోకి తెచ్చింది. ఎన్టీఆర్ సీఎంగా ఉండగా తహసీల్దార్ పేరును మండల రెవెన్యూ అధికారిగా మార్చారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మళ్లీ దాన్ని తహసీల్దార్‌గా మార్చారు.
తాజాగా ప్రభుత్వం డిప్యూటీ ఎమ్మార్వోను నాయబ్ తహసీల్దార్‌గా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పేరును గిర్దావర్‌గా మార్చింది. ఈమేరకు రెవెన్యూ శాఖ నుంచి కలెక్టర్ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ అయింది. తెలంగాణలో గతంలోఉన్న పేర్లనే పునరుద్ధరించాలంటూ ఇటీవల సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. తహసీల్దార్ కార్యాలయాన్ని తహసీల్ కార్యాలయంగా పేర్కొనాలంది.