
నేడు గుంటూరుకు వైఎస్ జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు వెళ్లనున్నారు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా సాయంత్రం 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకుంటారని వివరించారు.
అక్కడ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని తెలిపారు. - సాక్షి, విజయవాడ