
కోటేశ్వరరావుకు వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
కృష్ణా: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ నిడమానూరు వెళ్లారు.
కారు దగ్ధం ఘటనపై సర్పంచ్ కోటేశ్వరరావును వైఎస్ జగన్ కలిసి పరామర్శించారు. దగ్ధమైన కారును ఆయన పరిశీలించారు. కారు దగ్ధం చేసి రెండు రోజులైనా ఇప్పటివరకు పోలీసులను ఎవ్వరిని అరెస్టు వైఎస్ జగన్ మండిపడ్డారు.