మహిళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పై న్యాయవాద జేఏసీ ఫిర్యాదు చేసింది.
మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు: అడ్వొకేట్ జేఏసీ
హైదరాబాద్: ఓ సినీ వేడుకలో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ జేఏసీ సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం... ‘సావిత్రి’ సినిమా ఆడియో విడుదల వేడుకలో బాలకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సుంకరి జనార్దన్, రవికుమార్‌లు ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకొంటామని సీఐ తెలిపారు.