నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.