హైదరాబాద్ నగరంలో 7 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణి చేయనున్నట్లు లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్ చైర్ పర్సన్ రమేష్ తెలిపారు.
మారేడుపల్లి: హైదరాబాద్ నగరంలో 7 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణి చేయనున్నట్లు లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్ చైర్ పర్సన్ రమేష్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గత మూడు సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతులను నగరంలో వివిధ ప్రాంతాలలో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.సోమవారం మహేంద్రహిల్స్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సంవత్సరం లక్ష యాబై వేల రుపాయల వ్యయంతో 7 వేల విగ్రహాలను కోనుగోలు చేశామని,ఈ విగ్రహాలను బుధవారం నాడు ఉచితంగా జంట నగర వాసులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.దిల్‌సుఖ్ నగర్ పిఅండ్‌టి కాలనీ,వెస్ట్‌మారేడుపల్లి పార్కు,సైనిక్‌పురి సాయిబాబా ఆఫిసర్ కాలనీ, బిహేచ్‌ఈఎల్ మహిళ కమ్యూనిటి హాల్ తో పాటు పలు సేంటర్ల వద్ద ఉచితంగా మట్టి వినాయకులను అందించానున్నట్లు రమేష్ తెలిపారు. లయన్స్ ఎంటర్ ప్రై జర్స్ క్లబ్,సుడే పౌండేషన్ సంయుక్తంగా ఉచిత వినాయక పంపిణి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో శశికాంత్,సందీప్ గోండ్రలా తో పాటు పలువురు పాల్గొన్నారు.